రవితేజ తెలుగు సినిమా పరిశ్రమకు దొరికిన ఒక వజ్రం లాంటి వాడు. ఇతనిని ఎంత సాన పెడితే అంత ప్రకాశవంతంగా మెరుస్తాడు. రవితేజలో అపారమైన ప్రతిభ దాగి ఉంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే సినిమా అంటే రవితేజకి ప్రాణం. ఎటువంటి సినిమా నేపధ్యం లేకుండా ఇండస్ట్రీకి వచ్చి స్టార్ హీరోగా స్థిరపడ్డాడు.