అక్కినేని అమల సినిమాల్లోకి రాకముందు ఆమెకు నాట్యం అంటే చాలా ఇష్టం.. ఆ ఇష్టంతోనే పలు దేశాలలో నాట్య ప్రదర్శనలు కూడా ఇచ్చింది. ఈమె 10+2 చదువుతున్న రోజుల్లో నాటక ప్రదర్శన చేస్తున్నప్పుడు టీ. రాజేంద్ర ప్రసాద్ ఆమె నాట్యం చూసి సినిమాలో ఆఫర్ ఇచ్చాడట. మొదట అమల సినిమాలో చేయడానికి ఒప్పుకోలేదు. తన చదువు మొత్తం అయిపోయాక సినిమాల్లో నటిస్తానని తేల్చిచెప్పింది. కానీ ప్రసాద్ మాత్రం ఎగ్జామ్స్ అయిపోయాక షూటింగ్ మొదలు పెడదామని చెప్పడంతో.. ఆమె ఒప్పుకొంది.