చైతూ నటించిన ప్రేమకథా చిత్రాల్లో 'ప్రేమమ్' సినిమా కూడా ఒకటి.2016 లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ సినిమాను.. తెలుగు నేటివికి తగ్గట్లుగా రీమేక్ చేసాడు దర్శకుడు చందూ మొండేటి. ఇక సినిమాలో చైతూ సరసన హీరోయిన్స్ గా అనుపమ పరమేశ్వరన్, మడోనా సెబాస్టియన్ లతో పాటుగా శ్రుతిహాసన్ కూడా ఓ ప్రత్యేక పాత్రలో నటించారు..