మొదటిసారి కమెడియన్ వడివేలు ని హీరోగా డైరెక్టర్ శంకర్ "హింసై అరసన్ 24 ఆమ్ పులికేసి" చిత్రం ద్వారా పరిచయం చేశారు. ఈ సినిమా సక్సెస్ అవడంతో ఈ సినిమా సీక్వెల్ తీయాలని అనుకున్నాడు శంకర్. సగం షూటింగ్ కూడా పూర్తయిన తర్వాత , ఈ కథలో కొన్ని మార్పులు చేయడంతో వడివేలు నటించడానికి ఒప్పుకోలేదు. ఇక సినిమా సగం మధ్యలో ఆగిపోవడంతో డైరెక్టర్ శంకర్ కు రెండు కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది.