తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఇప్పటికే ఎన్నో ప్రేమ కథా చిత్రాలు వచ్చాయి. అందులో వేటికవే ప్రత్యేకంగా నిలిచాయి.ఇక ఈ మధ్య కాలంలో జనాలను ఆలోచింపజేసే ఒక అధ్బుతమైన ప్రేమ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'ఉప్పెన'.ఇటీవలే విడుదలైన ఈ చిత్రం ప్రేమకు ఒక సరికొత్త నిర్వచనాన్ని తెలిపింది. ఒక నూతన దర్శకుడు చేసిన ఈ ప్రయోగం ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచేలా చేసింది.