తెలంగాణా లో లాక్ డౌన్ ను పూర్తిగా ఎత్తేస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.ఈ మేరకు ఆదివారం అనగా జూన్ 20 నుంచి సినిమా థియేటర్లకు అనుమతులు ఇచ్చింది తెలంగాణా సర్కారు.ఇక రేపటి నుండి 100 శాతం ఆక్యుపెన్సీ తో థియేటర్లు నడిపించుకోవచ్చునని ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తూ థియేటర్ యాజమాన్యం తో పాటుగా సినీ ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పింది.