తెలుగు సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా హీరోగా ఎదిగిన ఏకైక వ్యక్తి ప్రభాస్ . ఈయన ఆదిపురుష్ సినిమాకు వంద కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.ఇక కోలీవుడ్ హీరో విజయ్ టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లితో పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు ఏకంగా విజయ్ వంద కోట్ల రూపాయలను రెమ్యునరేషన్ కింద తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక ఇదే గనుక జరిగితే మన సినీ ఇండస్ట్రీలో ప్రభాస్ ని ఢీకొట్టే ఏకైక హీరో విజయ్ మాత్రమే అవుతాడు అని సినీ వర్గాలు చెబుతున్నాయి.