సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన ఎన్నో సినిమాలలో , 1981 వ సంవత్సరం జూన్ 20వ తేదీన కట్టా సుబ్బారావు గారి దర్శకత్వంలో , రాధా క్రియేషన్స్ పతాకంపై సోమిశెట్టి సుబ్బారావు, గోరంట్ల వీరయ్య చౌదరి నిర్మాతలుగా వ్యవహరించగా , సూపర్ స్టార్ కృష్ణ హీరోగా శ్రీదేవి హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం గడసరి అత్త సొగసరి కోడలు. ఈ చిత్రానికి పినిశెట్టి కథ రాయగా, కాశీవిశ్వనాథ్ ఆయన కథకు మాటలు రాశారు. ఇందులో బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన భానుమతీ రామకృష్ణ గారు గడసరి అత్త పాత్రలో నటించగా, అతిలోక సుందరి శ్రీదేవి సొగసరి కోడలు పాత్రలో నటించి, అందరిని మెప్పించారు. ఈ సినిమాలో కథానాయకుడిగా కృష్ణ నటించారు. ఇక ఈ చిత్రం అప్పట్లో విజయవంతమయ్యి ప్రేక్షకుల మన్ననలు పొందింది.