ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. కాగా షూటింగ్ లో నేడు రామ్ చరణ్ పాల్గొనబోతున్నారు. ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్ తన సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ద్వారా ఈ విషయం తెలిసింది. ఆలిమ్ హకీమ్... చరణ్ కు హెయిర్ కట్ చేశారు. అనంతరం ఆయనతో కలిసి ఒక సెల్ఫీ తీసుకున్నారు. ఈ సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.