తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడు చిన్నా గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన హైదరాబాద్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నటనలో శిక్షణ పొందారు. శిక్షణ అనంతరం చిన్నా వేషాల కోసం మద్రాస్ వెళ్లారు. అయితే అప్పట్లో ఆయనకు మద్రాస్ తో కానీ, తమిళంతో కానీ పెద్దగా పరిచయం లేదు. అయితే చిన్నా అక్కడ వాళ్ల పెదనాన్న వాళ్లింట్లో దిగాడు.