లేడీ క్వీన్ రమ్యకృష్ణ మొదట 1990 నుంచి 2000 వ సంవత్సరం వరకు ఒక దశాబ్దకాలం పాటు స్టార్ హీరోయిన్ గా కొనసాగి,ఆ తర్వాత 2005లో వచ్చిన నా అల్లుడు సినిమా ద్వారా మోడ్రన్ అత్తగా సినీరంగ ప్రవేశం చేసింది. అలా హీరోయిన్ నుంచి ఆంటీ గా మారిపోయింది రమ్యకృష్ణ. ఇక తర్వాత కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమాలలో హీరో తల్లిగా నటించింది. ఇక బాహుబలి సినిమాలో శివగామి గా నటించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రమ్యకృష్ణ, సోగ్గాడే చిన్నినాయన సినిమాలో నాగార్జున సరసన నటించింది. ఇక తరువాత శైలజా రెడ్డి అల్లుడు సినిమాలో అత్త పాత్రలో శివంగిలా నటించింది. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న లైజర్ సినిమాలో మరొక పాత్రలో నటించబోతోంది రమ్యకృష్ణ.