నటుడిగా, విలన్ గా, కమెడియన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, దర్శకుడిగా, నిర్మాతగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న గిరిబాబు గారు తన కొడుకును సినీ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేయాలని, ఇంద్రజిత్ సినిమా ద్వారా హీరోగా పరిచయం చేశారు. ఇక ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. ఇక ఆ తర్వాత బాలీవుడ్ లో చమ్మా చక్కా అనే సినిమాలో హీరోగా నటించారు. ఇక ఈ సినిమా కూడా డిజాస్టర్ కావడంతో ఆయనకు సినీ ఇండస్ట్రీలో గుర్తింపు దక్కలేదు. ఇక ఆయన సినీ ఇండస్ట్రీకి దూరం కావాల్సి వచ్చింది.