1991లో కర్తవ్యం సినిమాలో నటించిన విజయశాంతికి జాతీయ నటి ఉత్తమ పురస్కారం వచ్చింది .7 సార్లు దక్షిణాది పురస్కార అవార్డులను,6 సార్లు ఉత్తమ నటి అవార్డులను, 2003 లో దక్షిణాది ఫిలింఫేర్ లైఫ్ టైం అచీవ్మెంట్ పురస్కారాన్ని కూడా అందుకుంది. 1980 వ సంవత్సరంలో జాతీయ నటిగా ఉత్తమ గుర్తింపు పొందారు విజయశాంతి.1990 లో సినిమా హీరోలతో సమానంగా పారితోషకం తీసుకున్న ఏకైక వ్యక్తి విజయశాంతి. అంతే కదా అప్పట్లో మన స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ లకు తన సినిమాలతో ముచ్చెమటలు పట్టించింది. ఇక ప్రముఖ దర్శకులు కూడా హీరోలను పట్టించుకోకుండా ఎక్కువగా విజయశాంతిని మెయిన్ రోల్ గా పెట్టి సినిమాలు తీసిన సందర్భాలు కూడా ఉన్నాయి.