ఈ లాక్ డౌన్ లో సీనియర్ నటుడు నరేష్,తన ఫాంహౌస్లో పెంచుకున్న చెట్ల నుండి కాయలను కోసి, స్వయంగా తానే అమ్మారట.వాటిని కిలో రూ.50 చొప్పున అమ్మగా, అతనికి మొత్తం మీద రూ.3,600 వచ్చిందట. ఇక అంతే కాదు ఈ లాక్ డౌన్ లో నాకు మంచి లాభార్జన కూడా వచ్చింది అంటూ తన ట్విట్టర్ ఖాతా లో పోస్ట్ పెట్టారు. తను సినిమాలలో తీసుకున్న పారితోషికం కంటే, ఇలా స్వయంగా వ్యవసాయం చేసి సంపాదించిన డబ్బే ఎక్కువ ఆనందాన్ని ఇస్తోందని తెలిపారు.