మురళి మోహన్ చిన్నప్పటినుంచి బిజినెస్ మీద ఆసక్తితో 1963లో కిసాన్ ఇంజనీరింగ్ అనే సంస్థలో మొదట 100 రూపాయల జీతంతో పనిచేసి , ఆ తరువాత 17 పైసలు వాటాతో ఎలక్ట్రిక్ మోటార్స్, ఇంజన్ ఆయిల్స్ వంటి వ్యాపారం చేసే వారు. ఆ తరువాత ఎన్నో నాటకాల్లో నటించడం నెమ్మదిగా మొదలు పెట్టారు. 1965 జూన్ 19న విజయలక్ష్మి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె,ఒక కుమారుడు ఉన్నారు. ఈయన 1973లో అట్లూరి పూర్ణచంద్రరావు దర్శకత్వంలో "జగమే మాయ" అనే సినిమాలతో తెలుగు లోకి అడుగుపెట్టారు.