మొట్టమొదటిసారిగా బాలకృష్ణతో, అందులోనూ అంత పెద్ద స్టార్ హీరోతో సినిమా చేయడం పూర్ణకు ఇదే మొదటిసారి. ఇక డైరెక్టర్ బోయపాటి శ్రీను అఖండ సినిమాకు హీరోయిన్ ఎంచుకున్నప్పుడు, బాలయ్య బాబుతో సరసన మీరు చేయాలని చెప్పడంతో ఆమెకు ఒక్కసారిగా భయం వేసింది అట. అంతేకాదు ఆయనతో మొదటి రోజు షూటింగ్ లో పాల్గొన్నప్పుడు ఆయన చాలా స్నేహపూర్వకంగా ఉంటారని, మంచి మనసున్న వ్యక్తి అని చెప్పుకొచ్చింది పూర్ణ.