నవ్య స్వామి ఆమె కథ సీరియల్ లో సహనటుడు రవికృష్ణతో కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. ఇదివరకే వీరిద్దరి మధ్య ఏదో ఉన్నట్లు రూమర్లు వచ్చాయి. ఇప్పుడు మరోసారి ఒక నెటిజన్" నవ్య స్వామి గతంలో అవిష్ గౌడ్ అనే వ్యక్తితో ప్రేమాయణం నడిపి, ఆ తర్వాత వారిద్దరి మధ్య బ్రేకప్ అయిపోయింది. ఇప్పుడు రవికృష్ణ తో ప్రేమాయణం సాగిస్తోంది అంటూ కామెంట్ చేశాడు. ఇక ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇక మరో సారి నవ్య స్వామి, రవికృష్ణ లు రూమర్స్ కి బలి అవుతున్నారు.