నిర్మాత చెంగల వెంకట్రావు ఎన్టీఆర్ తో నరసింహుడు సినిమాను అనుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్ తో తెరకెక్కించారు.ఇక ఈ సినిమా విడుదలైన మొదటి రోజే భారీ డిజాస్టర్ ను చవి చూడటం తో పెట్టిన పెట్టుబడిలో 20% కూడా ఆయనకు తిరిగి రాలేదు. ఇక డిస్ట్రిబ్యూతర్స్ నుంచి కూడా ఒత్తిడి మొదలవడంతో , అప్పులు తీర్చలేక నిర్మాత వెంకట్రావు హైదరాబాద్ ట్యాంక్ బండ్ లో దూకి ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారు. కానీ అక్కడ కొంతమంది చూసి ఆయన ప్రాణాలు కాపాడారు.