మంచి నటిగా గుర్తింపు పొందిన తన కూతురు అనూష కూడా మలయాళం సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగులో కూడారాజేంద్రప్రసాద్ హీరోగా నటించిన చిత్రం గోల్మాల్ గోవిందం అనే సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్ వంటి తదితర సినిమాలలో నటించి, ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయినప్పటికీ టాలీవుడ్ లో పెద్దగా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోలేక పోయింది.ఈమె గృహ లక్ష్మి, నిన్నే పెళ్ళాడుతా, జయం వంటి పలు సీరియల్ లలో నటించింది.