రోజా 1991లో మొదలైన తన సినీ ప్రస్థానం 2015వరకు నటిగా కొనసాగింది.ఇక తన సినీ కెరియర్లో ఎన్నో సినిమాలలో నటించిన రోజా, తనకు ఒక సినిమా అంటే చాలా ప్రత్యేకం అని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా తన జీవితంలో ఆ చిత్రానికి ఎప్పటికీ ఒక ప్రత్యేక స్థానం ఉంటుందట. అదే నాగార్జున హీరోగా తెరకెక్కిన చిత్రం అన్నమయ్య. శ్రీ వెంకటేశ్వర స్వామి పై అన్నమయ్య కు ఉన్న భక్తిని చాటి చెప్పే కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో రోజా నటించింది. అయితే ఈ సినిమాలో ఆమె ప్రధాన రోల్ చేయక పోయినప్పటికీ, ఇలాంటి చిత్రంలో నటించడం తను చేసుకున్న పుణ్యం అని పలు సందర్భాలలో వ్యాఖ్యానించింది.