ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 ను కేవలం హిందీలోనే విడుదల చేశారు. అయితే ఇతర భాషల్లో సీజన్ 1 చూసిన ప్రేక్షకులు తెలుగు, ఇతర భాషల్లో సీజన్ 2 ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. ఇక ఎట్టకేలకు ఈ వెబ్ సిరీస్ ను వచ్చే వారం నుండి తెలుగు మరియు ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.