రాజబాబు విపత్కర పరిస్థితులలో నష్టపోయిన ఎన్నో సంస్థలకు అండగా నిలిచారు. ఆయన సంపాదించిన డబ్బులో కొన్ని కోట్ల రూపాయలను ఆర్థికంగా నష్టపోయిన సంస్థలకు విరాళంగా ప్రకటించేవారు. ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోదగిన విషయం ఏమిటంటే, రాజమండ్రిలో చెత్తాచెదారాన్ని శుభ్రపరిచే కార్మికులకు , అక్కడే వున్న దానవాయిపేటలోని ఆయన పొలాలను వారికి జీవనార్థం కొరకు రాసిచ్చారు. ఇక ఆయన జన్మించిన స్థలం అయిన కోరుకొండలో "రాజబాబు జూనియర్ కళాశాల" అనే ఒక కాలేజీని తన పేరు మీద కట్టించి ఎంతో మంది విద్యార్థులకు ఇప్పటికీ ఉచితంగా విద్యను అందించడం గమనార్హం. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ తన దయనీయతను చాటుకున్నారు రాజబాబు.