మా ఎన్నికల నేపథ్యంలో అధ్యక్షురాలి పదవికి పోటీ చేస్తున్న జీవిత ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశంలో కరాటే కళ్యాణి, నరేష్ తదితరులు పాల్గొన్నారు. అయితే సమావేశంలో మీడియాతో మాట్లాడిన కరాటే కళ్యాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆడ వాళ్ళను గౌరవించని వారిని తాము ఒప్పుకోమన్నారు. తానే ఒక బాధితురాలిని అంటూ వ్యాఖ్యానించారు. అయితే తనను ఎవరు ఇబ్బంది పెట్టారన్నది కరాటే కల్యాణి వెల్లడించలేదు. ఇది సందర్భం కాదని సమయం వచ్చినప్పుడు కచ్చితంగా భయటపెడతానని అన్నారు.