తెలుగు చిత్ర పరిశ్రమకి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఫిదా సినిమాతో పరిచయమైంది సాయి పల్లవి. ఆమె నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది ఈ భామ. ఒక్కరకంగా చెప్పాలంటే.. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆ మాటకొస్తే మొత్తం సౌత్ సహజనటిగా పేరు తెచ్చుకుంది ఈ భామ. ఆమె ఎప్పటికప్పుడు వైవిధ్యమైన పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది.