కత్తి మహేశ్ కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు కోట్ల రూపాయలు విరాళాలు ఇస్తున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా ఈ విషయంపై కత్తి మహేష్ స్నేహితులు స్పందించారు. ఇప్పటివరకు అయిన ఖర్చుల్లో కత్తి మహేష్ తో ప్రయాణం చేసిన ఓ మిత్రుడు రవి కత్తి చూసుకున్నారని చెప్పారు. అంతేకాకుండా అపోలో హాస్పిటల్ లో కత్తి మహేష్ కు ఉన్న ఇన్స్యూరెన్స్ ను క్లైమ్ చేసి బిల్లు కట్టామని చెప్పారు. కత్తి మహేష్ కు ప్రమాదం జరిగినప్పుడు సెలబ్రేట్ చేసుకోవడం...అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వారిని జనం తిట్టిపోశారని అందుకే ఇప్పుడిలా ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.