రాశి రిషి ని హీరోగా తీసుకొని "మహారాజశ్రీ"అనే సినిమాను, తన భర్త దర్శకుడిగా, తన భర్త ఫ్రెండ్ (రిషి)తో సినిమా తీశారు. ఈ సినిమా భారీ డిజాస్టర్ ను చవిచూసింది. ఇక అంతే కాకుండా తన భర్త దర్శకత్వంలోనే "ఆదిత్య అనే హీరోతో.. ప్లీజ్ స్వారీ థాంక్స్" సినిమా తీయడంతో ఇది కూడా ఫ్లాప్ అయ్యింది. ఇక త్రిల్లర్ మూవీ "లంక"అనే సినిమాను తిరిగి తన భర్త దర్శకత్వంలో తీయడంతో ఈ సినిమా కూడా ఫ్లాప్ ను చవి చూసింది. ఇక ఆమె తన భర్త కారణంగానే తను సంపాదించిందంతా పోగొట్టుకున్నారు అని తెలుస్తోంది.