వెంకటేష్ అభిమాని తాను నారప్ప సినిమాను ఓటీటీలో విడుదల చేస్తున్నందున నిరాహార దీక్షకు దిగుతున్నట్టు ప్రకటించారు. వరంగల్ కు చెందిన కిరణ్ అనే వ్యక్తికి వెంకటేశ్ అంటే ఎంతో అభిమానం. వెంకటేష్ సినిమా విడుదలయ్యిందంటే మార్నింగ్ షో చూడాల్సిందే. అయితే ఇప్పుడు నారప్పను ఓటీటీలో విడుదల చేయడంపై అతడు నిరాశతో ఉన్నాడు. 'నారప్ప' సినిమాను ఓటిటి విడుదల చేయకండి .థియేటర్లోనే విడుదల చేయాలి అంటూ ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశాడు.