తాజాగా రామ్ చరణ్ , ఎన్టీఆర్ బైకు మీద చక్కర్లు కొడుతున్నట్లు ఒక ఫోటో ని విడుదలచేశారు. ఈ చిత్ర దర్శక నిర్మాతలు. ఇద్దరూ ఓకే బైక్ మీద కనువిందు చేస్తుంటే అభిమానులకు చూడడానికి రెండు కళ్ళు చాలడం లేదని తెలుస్తోంది. ఇప్పుడు ఈ పోస్టర్ ను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కూడా వదలడం లేదు.అయితే సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈ ఫోటోను తీసుకొని మార్ఫింగ్ చేసి వారిద్దరికీ కూడా హెల్మెట్ తగిలించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.