ప్రభాస్ అనుష్కల ఇద్దరూ కలిసి మూడు సినిమాలలో నటించి మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా బెస్ట్ జోడిగా గుర్తింపు కూడా పొందారు. అయితే వీరిద్దరి మధ్య ప్రేమాయణం సాగుతోందనే పుకార్లు చాలా ఎక్కువగానే వచ్చాయి. కానీ ఈ వార్తలపై అనుష్క ఎన్నోసార్లు స్పందించింది. మా ఇద్దరి మధ్య ఎలాంటి ప్రేమ వ్యవహారం సాగడం లేదని ,మేమిద్దరం మంచి మిత్రులుగా జీవితాంతం ఉంటామని ఆమె చెప్పుకొచ్చింది. అయితే సినీ ఇండస్ట్రీలో ఇద్దరు మంచి మిత్రులు కలిసి ఉంటే, అందులో ఆడ - మగ అయితే ఇలాంటి రూమర్స్ తప్పవు అని ఆమె ఎన్నోసార్లు చెప్పుకొచ్చింది.