రవితేజ శరత్ మండవ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సుధాకర్ చేకూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ఈ రోజు ప్రారంభించారు. మొదట హైదరాబాదులో రవితేజ ఇతర తారాగణం పై కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. ఈ సందర్భంగా ఓ అనౌన్స్మెంట్ పోస్టర్ కూడా విడుదల చేశారు. పోస్టర్ లో రవితేజ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ఆఫీసు ముందు కూర్చుని ఏదో టైప్ చేస్తున్నారు. ఈ పోస్టర్ సినిమాలో క్యారెక్టర్ ఇంటెన్సిటిని చూపిస్తోంది.