నటుడు బాబు మోహన్ ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం పై సంచలన కామెంట్స్ చేశారు. బాబు మోహన్ ఒక ఇంటర్యూలో మాట్లాడుతూ.... ప్రస్తుతం టీడీపీ కి ఎన్టీఆర్ అవసరం ఎంతగానో ఉందని ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీ బతకాలంటే ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వాల్సిందేనని అన్నారు. అలా అయితేనే టీడీపీ పార్టీ బ్రతుకవచ్చని అన్నారు. అంతే కాకుండా తాను కూడా ఎన్టీఆర్ ఎప్పుడు వస్తాడా అని ఎదురుచూస్తున్నట్టు తెలిపారు. మరోవైపు ఒకవేళ ఎన్టీఆర్ వస్తే పార్టీకి పట్టిన మసి అంతా కడిగేసి వస్తారో..లేదంటే వేరే పార్టీతో రంగంలోకి దిగుతారో తెలియదు కదా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.