బాహుబలి సినిమాలో అత్యంత కీలక పాత్ర శివగామి పాత్ర కోసం, మొదట దర్శకనిర్మాతలు శ్రీదేవిని సంప్రదించగా ఆమె ఆ పాత్ర కోసం రూ. ఎనిమిది కోట్ల రూపాయలను డిమాండ్ చేసిందట. నిర్మాతలు అంత ఇచ్చుకోలేమని చెప్పడంతో ఆమె వదులుకుంది. ఆ పాత్రలో రమ్యకృష్ణ చేసి ఆ పాత్రకు పూర్తి న్యాయం చేసింది.