సంపూర్ణేష్ బాబు ఇటీవల తెలంగాణలోని దుబ్బాక అనే ప్రాంతానికి చెందిన నరసింహాచారి దంపతులు అప్పులు ఎక్కువ అవడంతో ఆత్మహత్య చేసుకున్నారు. వీరు ఇలా చేయడంతో వీరి పిల్లలు అనాధలయ్యారు. ఈ విషయం తెలుసుకున్న సంపూర్ణేష్ బాబు వెంటనే వీరికి ఆర్థిక సాయం కింద 25,000 రూపాయలను అందించారు. అంతే కాకుండా ఇద్దరు పిల్లలు చదువుకు అయ్యే ఖర్చును తానే భరిస్తానని తెలిపారు.