సాధారణంగా అయితే అభిమానులు సెలబ్రిటీల వెంట పడుతుంటారు. ఎక్కడ కనిపించినా సెల్ఫీలు కావాలంటూ ఆటోగ్రాఫ్ లు కావాలంటూ వెంట పడిపోతారు. ఒక సెల్ఫీ ఇస్తే ఎంతో మురిసిపోతారు. సెలబ్రెటీలకు ఇలాంటి అనుభవాలు కామనే.. కానీ తాజాగా హీరోయిన్ ప్రజ్ఞా జైష్వాల్ కు వింత అనుభవం ఎదురైంది. ఈ హీరోయిన్ వెంట బెగ్గర్స్ పడ్డారు. ఉదయం జిమ్ కి వెళ్దామని ప్రజ్ఞా జైష్వాల్ ఇంటి నుండి బయటకు వచ్చింది. ఇంతలోనే ఒక బెగ్గర్సా్ బ్యాచ్ ఆమె వెంట పడింది. దాంతో ప్రజ్ఞా ఎంతో ఇబ్బంది పడినట్టు కనిపించింది. మెల్లిగా వారి నుండి తప్పించుకొని కారెక్కింది.