తెలుగుతో పాటు పలు భాషలలో నటించిన త్రిష ఒకప్పుడు టాలీవుడ్ లో అగ్రహీరోయిన్ గా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. వరుస సినిమాలతో స్టార్ హీరోల సరసన నటిస్తూ గొప్ప ఫాలోయింగ్ పెంచుకుంది. అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వలన సినిమాల సంఖ్య బాగా తగ్గించేసింది. కాగా వరుణ్ మణియన్ అనే వ్యాపారవేత్తతో ప్రేమలో పడ్డ త్రిష అతనితో నిశ్చితార్ధం జరుపుకున్న విషయం తెలిసిందే.