శిరీష బండ్లను ఉద్దేశిస్తూ.. మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు..చిరంజీవి ట్వీట్ చేస్తూ.." ఇప్పటివరకు ఎవరూ అందుకోలేని ఒక అద్భుతమైన ఫీట్ ని అందుకొని, మీ చిన్ననాటి కలలను అక్షరాల నిజం చేసుకుంటూ.. మీరు అంతరిక్షంలోకి వెళ్లడం ..మీ తల్లిదండ్రులకు, తెలుగు ప్రజలకు, భారతీయులందరికీ గర్వకారణం. మీరు వెళ్తున్న అంతరిక్ష మిషన్ గొప్పగా విజయాన్ని సాధించాలని నేను కోరుకుంటున్నాను.." అంటూ చిరంజీవి తన సందేశాన్ని పంపారు