1992లో కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా, మీనా, అపర్ణ లు హీరోయిన్ లుగా కలసి తెరకెక్కిన చిత్రం సుందరకాండ. ఇక అపర్ణ ఎవరో కాదు సుందరకాండ నిర్మాత కె.వి.వి.సత్యనారాయణ మేనకోడలు.ఈ చిత్రం ద్వారా మంచి విజయాన్ని అందుకున్న అపర్ణ, దాసరి దర్శకత్వంలో "అక్క పెత్తనం చెల్లెలి కాపురం" సినిమాలో నటించింది. ఇక ఆ తర్వాత 2002 లో అపర్ణ వివాహం చేసుకుని, ప్రస్తుతం అమెరికాలో సెటిల్ అయ్యింది.