మెగాస్టార్ చిరంజీవి ఈ నెలాఖరు వరకు షూటింగ్ లను వాయిదా వేసినట్లు తెలుస్తుంది. అయితే ఈలోగా ఆచార్య సినిమాకు దర్శకత్వం వహిస్తున్న కొరటాల శివ మాత్రం ముందు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పై కొన్ని సీన్ల షూటింగ్ ను ప్లాన్ చేస్తున్నారట. కొరటాల జూలై 6 నుండి చరణ్ తో ఒక భారీ ఫైట్ సీన్ చిత్రీకరించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.