మణిరత్నం దర్శకత్వంలో ఎన్నో వివాదాలు ఎదుర్కొని, సూపర్ హిట్ గా నిలిచిన చిత్రం ముంబై. మొదటిసారి ఈ సినిమా కథను హీరో విక్రమ్ కి వినిపించగా, అప్పుడు ఆయన గడ్డం, జుట్టు బాగా పెరిగిపోయి కనిపించారట. మణిరత్నం గారు విక్రమ్ ను ఈ సినిమాలో క్లీన్ షేవ్ చేసుకోవాలి అని చెప్పడంతో, విక్రమ్ ఇష్టంలేక ఈ సినిమాను వదులుకున్నారు.ఇక చివరికి ఈ సినిమాను రోజా సినిమా హీరో అరవిందస్వామితో తీశారు మణిరత్నం. ఇక విడుదలైన తర్వాత ఈ చిత్రం ఎన్నో వివాదాలు ఎదుర్కొంది. ఇక ఎట్టకేలకు అన్ని భాషలలో విడుదల అయ్యి, దేశవ్యాప్తంగా మంచి విజయాన్ని అందుకోవడం గమనార్హం.