చిన్న వయసులోనే సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టి తమకంటూ ప్రత్యేకమైన కీర్తిని దక్కించుకున్న నటులలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ కూడా ఒకరు. ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడే ఈమె పలు కాంట్రవర్సీలకు కేంద్రబిందువు అయిన విషయం తెలిసిందే. అయినా సరే నమ్మిన మార్గంలో పయనించడం, నచ్చిన విషయాన్ని వ్యక్తపరచడం, తప్పు అనిపిస్తే ఖండించడం తన శైలిగా ముందుకు సాగుతున్నారు హేమ.