మొదట హీరోగా అవకాశం కోసం చాలా ఆఫీసుల చుట్టూ తిరిగినట్టు సుజిత్ తెలిపాడు. ఈ నేపథ్యంలోనే నాగచైతన్య హీరోగా నటించిన జోష్ సినిమా ఆడిషన్స్ కు కూడా సుజిత్ వెళ్లారట. అయితే హీరోగా ఎక్కడా అవకాశం రాకపోవడంతో పాటు నువ్వు హీరో ఏంటి అన్న అవమానాలు కూడా ఎదురయ్యేయట. దాంతో తానే ఒక సినిమాను తీసి సత్తా చూపించాలని సుజిత్ డిసైడ్ అయ్యారట. ఈ నేపథ్యంలోనే కథలు రాసుకుని షార్ట్ ఫిలింలు తెరకెక్కించి ఆయనే హీరోగా నటించారు. అలా షార్ట్ ఫిల్మ్ లు చేస్తున్న క్రమంలో తాను హీరోగా పనికిరాను అని గ్రహించి దర్శకత్వంపై ఫోకస్ పెట్టారట.