తాప్సీ హీరోయిన్ ల రెమ్యూనరేషన్ పై మీడియాలో జరుగుతున్న దుమారం గురించి తనదైన రీతిలో స్పందించింది. ఏదైనా ఒక హీరోయిన్ రెమ్యూనరేషన్ పెంచింది అంటే దాన్ని ఎందుకు పెద్ద వార్తలా చూస్తారు, నాతో పాటే సినిమా జీవితాన్ని మొదలు పెట్టిన హీరో నా కంటే మూడు రెట్లు ఎక్కువగా పారితోషకం తీసుకుంటున్నాడు. వాళ్లు సినిమాకు కేటాయించే రోజులకంటే మేము ఎక్కువ రోజులు కేటాయించినా కూడా మాకు తక్కువ రెమ్యూనరేషన్ ఇస్తారు. అది ఒకవేళ లేడీ ఓరియంటెడ్ సినిమా అయినా కూడా నిర్మాతలు తక్కువ బడ్జెట్ తో సినిమాలు తీసేయాలనే కారణంగా హీరోయిన్ రెమ్యూనరేషన్ లోనే కోతలు విధిస్తారు.