సెలబ్రిటీలు ప్రేమించి విడిపోయాక, లేదంటే వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పున్న తరవాత ఇద్దరూ కలిసి దిగిన ఫోటోలను వీడియోలను సోషల్ మీడియా నుండి వెంటనే డిలీట్ చేస్తారు. అలాగే మెహరీన్ కూడా బిస్నోయ్ తో దిగిన ఫోటోలను, తన నిశ్చితార్థం ఫోటోలను సోషల్ మీడియా నుండి తీసి వేసింది. కానీ బిస్నోయ్ మాత్రం ఇప్పటికీ మెహరీన్ తో కలిసి దిగిన ఫోటోలను, నిశ్చితార్థం ఫోటోలను డిలీట్ చేయకుండా అలాగే ఉంచారు. దాంతో ఇప్పటికీ మెహరీన్ జ్ఞాపకాలను బిస్నోయ్ చెరిపివేయలేదదంటూ పలువురు నెటిజన్ లు అభిప్రాయపడుతున్నారు.