సితార ఎంటర్టైన్మెంట్స్ మరో మలయాళ చిత్రం కప్పెల రీమేక్ ను కూడా ప్రారంభించింది. ఈ సినిమాలో హీరోగా విశ్వక్సేన్ నటిస్తారని కొద్ది రోజులుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ వార్తలకు చెక్ పెడుతూ ఈ చిత్రంలో సిద్దు జొన్న గడ్డల హీరోగా నటిస్తున్నట్లు స్పష్టమైంది. ఈ రోజు సినిమాను అధికారికంగా లాంచ్ చేశారు. ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చేతుల మీదుగా క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఈ సినిమాకు చౌదరి చంద్రశేఖర రమేష్ అనే నూతన దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో సిద్దు హీరోగా నటిస్తుండగా తమిళ నటుడు అర్జున్ దాస్ కీలక పాత్రలో నటించబోతున్నారు.