యాంకర్ విష్ణు ప్రియ తనకు కాబోయే భర్త ఇలా ఉండాలంటూ ఒక ఆసక్తికర పోస్ట్ చేసింది. తన స్టోరీలో విష్ణు ప్రియ ఆషిక్ 2 సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న హీరో ఆదిత్యరాయ్ కపూర్ ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటోకు 'దేవుడా ఓ మంచి దేవుడా వచ్చే జన్మలో అయినా నాకు ఇలాంటి భర్త కావాలి అంటూ పోస్ట్ పెట్టింది. దాంతో నెటిజన్లు విష్ణు ప్రియను ఆ దేవుడు కరుణించాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఆదిత్య రాయ్ కపూర్ 'ఏక్ విలన్ 2' అనే సినిమాలో నటిస్తున్నాడు.