నాగార్జున ఓల్డ్ లుక్ ఫోటోపై నెట్టింట తెగ ట్రోల్స్ వస్తున్నాయి. అయితే కొందరు అది ఓ సినిమా కోసం వేసిన గెటప్ అంటుండగా మేకప్ వేయకపోయినా ఇప్పుడు అలాగే ఉంటారని కామెంట్ పెడుతున్నారు. నాగ్ ఫోటోకు నాగ్ తాత అంటూ కామెంట్స్ కూడా పెడుతున్నారు. ఇక మరికొందరు ఏజ్ గురించి మనకెందుకు సినిమాల్లో అయితే యంగ్ గా కనిపిస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతానికి నాగార్జున రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు.