తమ అభిమాన హీరో నుండి కొత్త సినిమా వస్తుందంటే చాలు..ఫ్యాన్స్ లో ఆ హడావిడి వేరేగా ఉంటుంది.ఆ సినిమాను ఎప్పుడెప్పుడా చూసేద్దామా అని ఆరాటపడుతుంటారు అభిమానులు. మరి విడుదల కావాల్సిన సినిమాలు ఉన్నట్టుండి ఆగిపోతే..అభిమానుల్లో ఎలాంటి ఆందోళన వ్యక్తం అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అయితే వీటిల్లో కొన్ని సినిమాలు కొబ్బరికాయ కొట్టాక కొన్ని ఆగిపోతే..సినిమా చర్చలు పూర్తయి ఆఖరి దశలో ఆగిపోయిన సినిమాలో ఇంకొన్ని ఉంటాయి.