'బంగార్రాజు సినిమాలో నాగార్జున తో పాటు నాగచైతన్య కూడా ఒక ప్రధాన పాత్రలో నటించే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటికే నాగార్జున కు జంటగా నటించడానికి బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ను సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే నాగచైతన్య కు జంటగా నటించడానికి ఒక నటి అవసరం ఉండగా దర్శకుడు ఆ పాత్రకు కృతి శెట్టి అయితే బాగుంటుందని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది.