నిజం సినిమాలో మహేష్ బాబు నిస్సహాయుడు గా ఉండడం వల్ల ఈ సినిమాకి మైనస్ గా మారింది. అంతే కాకుండా తల్లి సహాయం లేకుండా ఎటువంటి పని చేయలేడా.? అనే తరహాలో హీరో ఉండడంచేత ప్రేక్షకులను నిరుత్సాహ పరిచారు. ఇందులో గోపీచంద్ ని విలన్ గా బాగా చూపించడం, హీరో ని సరిగ్గా చూపించ లేకపోవడం తమ అభిమానులకు నచ్చలేదు. ఈ విషయాలను స్వయంగా డైరెక్టర్ తేజ ఒకానొక సమయంలో వివరించారు.