బాబి మెగాస్టార్ తో గ్యాంగ్ లీడర్ లాంటి సినిమాను తెరకెక్కిచబోతున్నారట. మొదటగా బాబి చెప్పిన కథకు చిరంజీవి పెద్దగా సంతృప్తి చెందక పోవడంతో బాబి కథపై మరికొన్ని రోజులు పనిచేసి అందులో మార్పులు చేర్పులు చేసినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా కథలో మాస్ ఎలివెంట్స్ కూడా ఎక్కువే ఉన్నట్టు టాక్. అంతే కాకుండా బాబి చెప్పిన కథకు మెగాస్టార్ కూడా ఫిదా అయ్యారట. దాంతో ఈ సినిమా గ్యాంగ్ లీడర్ సినిమా లాంటి మాస్ మసాలా సినిమా అని ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి.